తొలుత హైదరాబాద్ లోనే ఈ సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, వైద్యులతో జగన్ మాట్లాడిన తరువాత ముంబాయిలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్ కు సైతం ఇదే తరహా సమస్య రాగా ముంబాయిలోనే సర్జరీ చేయించుకొని కోలుకున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఇప్పుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబాయి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్దమయ్యారు. ఇప్పటికే నాని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల రిపోర్ట్స్ తో ముంబాయిలోని వైద్యులతో సంప్రదింపులు చేసారు. వారి సూచన మేరకు ఈ రోజు అక్కడ ఆస్పత్రిలో చేర్చాలని నిర్ణయించారు. బుధవారం నానికి సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్పెషల్ ఫ్లైట్ లో ముంబాయికి కొడాలి నాని..
