కోల్ కతా ఆస్పత్రి ఘటనపై కోర్టు సంచలన తీర్పు..

kolkatha-20.jpg

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసు విచారణ సోమవారం కోల్‌కతాలోని సీల్దా కోర్టులో జరిగింది. న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఈ కేసును విచారించారు. సోమవారం శిక్ష ఖరారు చేసే ముందు దోషి సంజయ్ రాయ్ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకునే అవకాశం లభించింది. నన్ను ఇరికించారని, ఒత్తిడి చేసి బలవంతంగా పత్రాలను తారుమారు చేశారని సంజయ్ రాయ్ అన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్ కు జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Share this post

scroll to top