అంతా మాయ..

cbn-17.jpg

గత ప్రభుత్వం ఉద్యోగులు రిటైరైనప్పుడు వచ్చే జీతంలో ఏభై శాతం పెన్షన్ వచ్చేలా స్కీమును తెచ్చారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఆంధ్ర మోడల్ పేరుతో కేంద్రం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇది బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము ఓపీఎస్‌కు వెళుతున్నామని చెప్పినా, ఆచరణలో చేయలేకపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు సీపీఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. వారిని రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అబద్దాలను నిత్యం వండి వార్చేవి. ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నికలు జరగ్గా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మొదలైనవారు  జగన్‌కు వ్యతిరేకంగా మారారు. కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. వారంతా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా ట్రాప్ లో పడ్డారు. నిజంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ వస్తుంందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుని జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఓనే  అమలు చేస్తుంది.

Share this post

scroll to top