కోనసీమలో పెను విషాదం.. 

danger-27.jpg

కాకినాడ, మండపేట, రామచంద్రపురం నుంచి 11 మంది స్నేహితులు కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని శేరిలంకలో శుభకార్యానికి వచ్చారు. హాఫ్ శారీ పంక్షన్ అయిపోయిన అనంతరం సాయంత్రం వేళ అందరూ సరదాగా గోదావరి దగ్గరకు వెళ్లారు. అనంతరం స్నానాలకు దిగి ఈత కొడుతుండటం ఒక యువకుడు మునిగిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో 8మంది గల్లంతయ్యారు.

అయితే ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్‌, మేడిశెట్టి చరణ్‌ రోహిత్‌, కనికెళ్ల సురేష్‌ సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతవ్వడం కలకలం రేపింది. ఈ విషయం తెలుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీళ్లకి ఈ ప్రాంతంలో నది ఎంత లోతు ఉంటుంది అనేది అంచనా తెలియలేదు. ముందు ఒక యువకుడు పట్టుతప్పి కొట్టుకుపోతుండడంతో అతని కాపాడే క్రమంలో మిగతా వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు.

Share this post

scroll to top