ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర..

ktr-14-.jpg

ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ కొడంగల్‌ ఘటనపై కేటీఆర్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు. నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అంటూ మండిపడ్డారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ నిలదీశారు. 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అంటూ ఫైర్‌ అయ్యారు. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను అని తెలిపారు. నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top