యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల రాష్ట్ర ప్రజలకు తీరని లోటు ఏర్పడిందన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదలైన రోజుల్లో నల్లగొండ జిల్లా రైతులు అడ్డుకుని పోరాటం చేశారన్నారు. ఆ తరువాత చంద్ర బాబు నాయుడు ప్రభుత్వంలో హైదరాబాద్ కి త్రాగునీరు అందించాలని ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారని తెలిపారు. అప్పుడు కూడా రైతులు అడ్డుకున్నారని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న నగరం హైదరాబాద్ కి మంచి నీటి అవసరాలు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగు నీటి కి కావాల్సిన ప్రాజెక్ట్ లు అందించారు. ఆ తరువాత సుంకిశాల అంశాన్ని తీసుకుని తిరిగి ప్రారంభించారన్నారు.
హైదరాబాద్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ ..
