హస్తం పార్టీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.. మొదట్లో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. ఇటీవల మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.. అయితే.. కేసీఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉండే వారే పార్టీను వీడుతుండటం.. ప్రస్తుత ఫిరాయింపు రాజకీయ పరిస్థితులపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చరిత్ర పునరావృతం అవుతుంది… అంటూ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నామని వీర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్ కు హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు చరిత్ర పునరావృతం అవుతుంది కేటీఆర్ సంచలన ట్వీట్..
