రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తారా..హైదరాబాద్‌ కు రాహుల్‌ రావాలి..

ktr-3.jpg

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. మరోసారి అశోక్ నగర్ కు రావాలని ఆయన ట్వీట్ లో కోరారు. తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత అది సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వెళ్లి నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చిన సంగతిని కేటీఆర్ గుర్తు చేశారు. ఎనిమిది నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ జీరో అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ జీ మరోసారి అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని ఆయన ట్వీట్ లో కోరారు.

Share this post

scroll to top