అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 330 రోజులు ముగిశాయని, ఏడాది నిండడానికి ఇంకా 35 రోజులే మిగిలిందన్నారు. కాంగ్రెస్ హామీలపై ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన హామీలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలాయని, చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలయ్యాయని మండిపడ్డారు. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో మూసీ సర్కార్ పబ్బం గడిపిందని విమర్శించారు. ఈ ప్రజా పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు తప్ప చెప్పుకోవడానికి ఏమున్నదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హామీలపై రాహూల్‌ని నిలదీసిన కేటీఆర్..
