కేసీఆర్‌ను తిడితే నీ నాలిక చీరేస్తాం..

ktr-06.jpg

తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన పాలనాపరమైన అనుభవ లేకపోయినదాని సూచనగా ఉందని విమర్శించారు కేటీఆర్‌.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయని, తాము ఎప్పటి నుంచో ఢిల్లీ పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని, రేవంత్ రెడ్డి మాటలు దివాలా కోరి వానిలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారం ఉన్నప్పటికీ, పలు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా NGOలు కీలకంగా కదం తొక్కాయి. వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నేతలకు గౌరవంగా ఉన్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉద్యమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Share this post

scroll to top