సీఎం రేవంత్ ను ఉద్దేశించి నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాజాగా రేవంత్ తన లక్ష్యం గురించి వివరించారు. తనకు గేమ్ ప్లాన్ పైన పూర్తి స్పష్టత ఉందన్నారు. రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కా ళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుగుతున్నదని, విచారణ సమయంలో కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యా పింగ్ నిందితుల పాస్‌పోర్ట్ రద్దయిందని, కాబట్టి అనధికారికంగా విదేశాల్లో ఉండలేరని చెప్పారు. తనది చిన్న వయసని, రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉందని ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తానని వివరించారు.
నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది..
