మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు కేటీఆర్ సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు రికార్డు చేయాల్సి ఉంది. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ కోర్టుకు హాజరవుతారనుకుంటున్న క్రమంలో కేసు వాయిదా పడింది. పరువునష్టం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. సోమవారం ఉదయం కోర్టు కేటీఆర్ స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది.
పరువు నష్టం కేసు వాయిదా..
