ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ‘థాంక్యూ సుప్రీంకోర్టు ఊరట లభించింది. న్యాయం గెలిచింది అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. మరో వైపు కవితకు బెయిల్ మంజూరుపై కేసీఆర్ రియాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న కేసీఆర్ కవిత జైలు నుంచి విడుదల కానుండటంతో రాజకీయంగా ఎలాండి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కవిత విడుదలతో బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయనేది సస్పెన్స్ గా మారింది.
కేటీఆర్ కవిత బెయిల్ పై ఫస్ట్ రియాక్షన్..
