కానిస్టేబుళ్ల కుటుంబాలకు కేటీఆర్ సంఘీభావం..

police-24-.jpg

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిచ్ పల్లి 7వ బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపి, వారి సమస్యలు విన్నారు. 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నా చేస్తే భర్తలను సస్పెండ్ చేయడం అన్యాయమని కేటీఆర్ కు ఏకరువు పెట్టారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ సమస్యలను మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యల ధర్నాతో భర్తలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బెటాలియన్ల కానిస్టేబుల్స్ కుటుంబాలు వరుస ఆందోళనలు సాగిస్తున్నాయి. నల్లగొండలో మొదలైన ఆందోళనలు వరంగల్, సిరిసిల్ల, డిచ్ పల్లి బెటాలియన్లకు విస్తరించాయి.

Share this post

scroll to top