లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కమిటీ సభ్యులకు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ స్వాగతం పలికారు. కురియన్‌తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో వరుసగా భేటీ అవుతారు. నేడు ఎంపీలు, లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతారు.