బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నతనంలో తాను ఏనాడూ డాక్టర్ కావాలని అనుకోలేదని అన్నారు. డాక్టర్ కావాలని అనుకున్నానని మా అమ్మ కూడా నన్ను డాక్టర్ గా చూడాలనుకుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను కూడా చదువులో ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదని కష్టపడి చదివానని బీ ఫార్మసీలో సీటు కూడా వచ్చిందని అన్నారు. కర్ణాటక సెట్ రాస్తే అక్కడ ఎంబీబీఎస్ సీటు వచ్చింది. చివరి క్షణంలో ఎంబీబీఎస్ సీటు వదులుకొని డిగ్రీ చేశానని తెలిపారు.
ఆ తర్వాత ఫారెన్ వెళ్లాను. అక్కడ మంచి కంపెనీలో జాబ్ కూడా చేశారు. చివరకు అవన్నీ వదులుకొని ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కంచ గచ్చిబౌలి భూములపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భూముల విక్రయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిందని ఆరోపించారు. అటవీ భూములను నాశనం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. భారీ కుట్రపై కేంద్రప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.