ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ… కవితను అదుపులోకి తీసుకున్నాయి. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనేక మార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం… అందుకు కోర్టు ధిక్కరచడం షరా మామూలుగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా కవిత జైలు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. తాజాగా కవిత తరపున లాయర్లు కీలకమైన అంశాన్ని బెయిల్ పిటిషన్‌లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. దీంతో మరికొంత కాలం కవిత జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరికొంత కాలం కవిత జైలులోనే..
