2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం. 2లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చుతున్నాం. నా జీవితంలో ఇది మరపురాని రోజు. రైతు రుణమాఫీ అద్భుతమైన కార్యక్రమం. ప్రభుత్వం తరఫున రైతులందరికీ కృతజ్ఞతలు. దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రూ.లక్ష వరకు తొలివిడతలో రుణమాఫీ చేస్తున్నాం. రైతు రుణమాఫీకి పాస్ పుస్తకాలే ముఖ్యం. రేషన్ కార్డు ముఖ్యం కాదు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే అధికారులు సరిచేస్తారు. రుణమాఫీపై అపోహాలు, అబద్దాలు చెబుతున్నారు వాటిని నమ్మకండి. ఇదే సమయంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు.
తొలివిడత రుణమాఫీ..
