భక్తిశ్రద్దలతో ఈ ఒక్క పని చేస్తే చాలు..

krishna-24.jpg

శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26న నిర్వహించుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో తిథి, రోహిణి నక్షత్రం నాడు నిర్వహించుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీ కృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణునిగా,చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుని పుట్టినరోజు అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అనంత ఘనంగా నిర్వహించుకుంటాం.

భక్తులు ముందుగా స్వామి వారిని విగ్రహరూపంగా, ప్రతిమ రూపంగా ఆలయంలో లేదా ఇంట్లో ఉన్న స్వామివారిని ఉదయం పూట ప్రత్యేకంగా అలంకరించి దీపారాధన చేయాలి. కృష్ణాష్టకంలో ఉన్న మొదటి శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా భావించుకొని పఠించుకోవాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ 116 సార్లు, 516 సార్లు లేదా 1,116 సార్లు జపించాలి. ఇలా స్వామివారిని జపించడం ద్వారా స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.

Share this post

scroll to top