బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

rain-07.jpg

నైరుతి బంగాఖాళాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే పడిపోయాయి. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత కనిష్టస్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరోవైపు తమిళనాడుకు తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 19 జిల్లాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించగా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Share this post

scroll to top