నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు

rain-1.jpg

ఈ సంవత్సంర నిండూ వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరికొందరు రైతులు మాత్రం ముందస్తుగానే వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ సంవత్సరం గతంతో పోలిస్తే ముందస్తుగానే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, మే 31 కేరళ, జూన్ మొదటి వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించనున్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారనుందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుంగంగా బలపడనుంది. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తారు వానలు కురుస్తాయి. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అప్రమత్త మవుతున్న రైతులు వ్యవసాయం చేయడానికి ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Share this post

scroll to top