ఇటీవల కురిసిన వర్షాలకే ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత ఐదు రోజులుగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదలతో నిరాశ్రులైన వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్ని బాధితులకు సమకూర్చుతున్నారు. ఇప్పుడిప్పుడు కొంత ఉపశమనం కలుగుతుందనగా మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోవడంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఈ రోజు ఉదయం మరోసారి వర్షం కురిసింది. ఇదేకాకుండా బుడమేరుకు వరద పెరగడంతో బెజవాడ వాసుల్లో భయం మొదలైంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
