ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రకు జీవం పోసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు ఇండియన్ సినీ ప్రేక్షకులే కాదు. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. గ్లోబల్ స్టార్ నటనను ఎందరో హాలీవుడ్ యాక్టర్స్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ యాక్టర్ లుకాస్ బ్రావో కూడా ట్రిపులార్‌లో రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలో ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని అడిగినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెప్పిన లుకాస్ బ్రావో. RRR లో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు. అతను చేసే విన్యాసాలు, తెరపై ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది అని పేర్కొనటం విశేషం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసలు..
