ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు..

ismart-29.jpg

మాములుగా హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తొలిపార్టుకు మంచి సీక్వెల్ పార్టు ఉంటుందని ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. కాగా అలాంటి అంచనాలతో రూపొందుతున్న సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌. ఐదేళ్ల కిందట బాక్సాఫీస్‌ దగ్గర ఇస్మార్ట్‌ శంకర్‌ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికీ టాలీవుడ్‌ టాప్-10 మోస్ట్‌ ప్రాఫిటెబుల్‌ మూవీస్‌ లిస్ట్‌లో ఇది ఒకటి. అప్పటివరకు లవర్‌ బాయ్‌ రోల్స్‌తో అదరగొట్టిన రామ్‌ పోతినేని.. తొలిసారి మాస్‌ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. ఈ సినిమాతో రామ్‌కు మాస్‌ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రామ్ కథల ఎంపికలో కూడా చాలా చేంజేస్ వచ్చాయి. అదే క్రేజ్‌తో డబుల్ ఇస్మార్ట్ ను స్టార్ట్ చేశారుగతేడాది జులై లో సెట్స్ మీదకు వెళ్లిన డబుల్ ఇస్మార్ట్.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసకుంటుంది.

Share this post

scroll to top