మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. సెక్టార్ 22లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంట్లు అన్ని తగలబడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంటున్నారు. భక్తులు, వీఐపీల వసతి కోసం పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే జనవరి 19న ఇవే టెంట్లు దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మళ్లీ ఇదే ప్లేస్‌లో టెంట్లు తగలబడటంతో భక్తులు ఆందోళనతో పరుగులు తీస్తున్నారు. అసలు మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.