కుంభమేళాకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

trafic-29.jpg

మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతోన్న కుంభమేళా లో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే రహాదారులన్ని వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే కుంభమేళా రద్దీని దృష్ట్యా, తదుపరి ప్రకటన వచ్చేంత వరకు బీహార్ రాష్ట్రం నుంచి భారీ వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా నిషేధించింది. కుంభమేళా లో ఊహించిన రద్దీని చక్కదిద్దేందుకు పోలీసులు తమమునకలు అవుతున్నారు.

ముఖ్యంగా గయా, ఔరంగాబాద్, రోహ్తాస్ కైమూర్ జిల్లాల్లో ఎన్‌హెచ్-19 వెంట దాదాపు 15 వేలకు పైగా భారీ వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. కైమూర్ ఎస్పీ హరి మోహన్ శుక్లా మాట్లాడుతూ కేవలం కార్లు ఇతర తేలికపాటి మోటారు వాహనాలు, అంబులెన్స్‌లు మాత్రమే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ పరిణామంతో ఎన్‌హెచ్-19, ఎన్ హెచ్-౩౩౦ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Share this post

scroll to top