ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం..

devandra-5.jpg

మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి కానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులందరూ ఆజాద్ మైదాన్‌కు చేరుకుంటారు. మహాయుతి ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తర్వాత, దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.

Share this post

scroll to top