నేడు ఈడీ విచారణకు మహేష్ బాబు..

mahesh-12-.jpg

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.. సాయి సూర్య డెవలపర్స్ కేసులో గతంలో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్‌ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. మహేష్‌ బాబుకు ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 28వ తేదీన విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మహేష్ బాబు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే షూటింగ్‌ షెడ్యూల్‌ కారణంగా తాను విచారణకు రాలేఖపోతున్నట్టు లేఖ రాసారు మహేష్ బాబు.

కాగా మహేష్ బాబు ఇవాళ ఈడీ విచారణ హాజరుకావాల్సి ఉంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో విచారణ సాగుతోంది. గతంలో షూటింగ్ కారణంగా రాలేకపోతున్నానంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపారు మహేష్ బాబు అయితే విచారణకు రావాలంటే ఈడీ అధికారులు మరో తేదీని సూచించారు. అది ఈరోజే అయితే మహేష్ బాబు ఇవాళ్టి విచారణకు హాజరవుతారా? లేదంటే మరో తేదీని కొరుతారా? ఏం జరుగుతుందో చూడాలి. సాయి సూర్య డెవలపర్స్‌ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు  అందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల RTGS ద్వారా తీసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా మహేష్‌ బాబు నోటీలిచ్చారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share this post

scroll to top