విమానం కుప్పకూలిన ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం 8 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వర్జీనియా రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 64 మందితో ఓ విమాన ల్యాండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఫ్లైట్ పోటోమాక్ నది సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ ఆ ప్యాసింజర్ ఫ్లైట్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమాన శకలాలు పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు ల్యాండింగ్ ట్రాక్‌కు సమీపంలోనే విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. ఈ ప్రమాదం కారణంగా రీగన్ నేషనల్ పరిధిలోని అన్ని విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.