ఒంపు సొంపులతో వలపు బాణాలు సందింస్తున్న మాళవిక..

malavika-09.jpg

4 ఆగస్టు 1993న కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలోని పయ్యనూర్ లో జన్మించింది వయ్యారి భామ మాళవిక మోహనాన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కూతురు ఈ బ్యూటీ. మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెరిగింది ఈ ముద్దుగుమ్మ. తన తండ్రిలనే సినిమాటోగ్రాఫర్‌గా లేదా దర్శకురాలిగా అవ్వాలన్న ఆశతో ముంబైలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన ఫెయిర్‌నెస్ క్రీమ్ కోసం కమర్షియల్ షూట్‌కి ఆమె తన తండ్రితో కలిసి వెళ్లింది.

మాళవికకు నటనపై ఉన్న ఆసక్తి గురించి నటుడు ఆరా తీసి మలయాళ చిత్రంలో తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశం కల్పించారు. తన నిర్ణయం కోసం కొంత సమయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలా పట్టం పోల్‌ అనే మలయాళీ చిత్రంతో కథానాయకిగా తొలిసారి నటించింది. 2016లో నాను మట్టు వరలక్ష్మి అనే చిత్రంతో కన్నడలో పరిచయం అయింది. 2019లో పేట చిత్రంతో తమిళ అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‎లో హీరోయిన్‎గా తొలిసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తుంది.

Share this post

scroll to top