తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ. ప్రభాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర చేస్తున్నారు. తాజాగా విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ నా దృష్టిలో నార్మల్ యాక్టర్ మాత్రమే అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇంతకూ మంచు విష్ణు ఏమన్నారంటే మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టరే అతను లెజెండ్ కాదు ప్రభాస్ లెజెండ్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది. మోహన్ లాల్ ఓ లెజెండ్ ఎందుకంటే కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది. ప్రభాస్ త్వరలోనే లెజెండ్ అవుతాడని ఆశిస్తున్నా అని మంచు విష్ణు అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కన్నప్ప సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.