రేవంత్ ని కలిసిన మందకృష్ణ మాదిగ..

madha-krishna-22.jpg

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు కలిశారు. కాగా, ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఏండ్లుగా వర్గీరణ కోసం పోరాడుతున్న సమస్యకు పరిష్కారం చూపినట్లుయింది.

Share this post

scroll to top