హైదరాబాద్ మహానగరంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ సందర్భంగా ఆ ఇంటి లోపల దాదాపు పది మంది చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గౌడేన్ కు సైతం మంటలు అంటుకున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని, మరికొందరిని కాపాడింది అగ్నిమాపక సిబ్బంది
ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మహానగరంలో భారీ అగ్నిప్రమాదం..
