హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. మొత్తం పోలైన 88 ఓట్లలో ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు లభించాయి. క్రాస్ ఓటింగ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి తీరని నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 112 ఓటర్లలో 88 ఓట్లు మాత్రమే పోల్అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంటలోనే ఫలితాలు తేలిపోయాయి.
బీజేపీకి భారీ షాక్..
