రాష్ట్రంలోని మునిసిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మునిసిపల్ శాఖకు సంబంధించిన అధికారులందరూ హాజరయ్యారు. ఈ సమీక్షలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రైనేజీ పూడికతీత తొలగింపుపై కమిషనర్లకు మంత్రి నారాయణ ముఖ్య సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ ప్రాంతాలలోని క్యాంటీన్ భవనాల నిర్మాణం తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైన్ లలో పూడిక తీత పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మునిసిపల్ కమిషనర్లతో నారాయణ వీడియో కాన్ఫరెన్స్..
