అమరావతి రాజధాని నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం అయితే, రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా నిధుల సేకరణ జరుగుతోందదన్నారు మంత్రి నారాయణ. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి నారాయణ.
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం..
