మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన..

farmars-28.jpg

ఏపీ రైతుల కు మంత్రి పయ్యావుల కేశవ్ గుడ్ న్యూస్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ను ఆయన ప్రవేపెట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ మరో సూపర్ సిక్స్ పథకంపై అసెంబ్లీ వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని సూపర్ పథకాల్లో హామీ ఇచ్చామని, త్వరలో అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని తెలిపారు.

రాష్ట్రానికి రైతు అవసరం ప్రతి రోజు ఉంటుందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం రూ. 20 వేలు అందించేలా బడ్జెట్‌లో రూపకల్పన చేశామన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిస్తోందని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Share this post

scroll to top