నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు హోల్డ్ లో పెట్టామన్నారు. అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్ మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈ సారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు మించిన విస్తీర్ణంలో బెస్ మెంట్ వరకు పూర్తయిన ఇళ్లు దాదాపు 300 వరకు ఉన్నాయని వీటికి మిహనహాయింపు ఇస్తామన్నారు. అయితే ఇది కేవలం బేస్ మెంట్ వరకు మాత్రమే మనిహాయింపు ఉంటుందని ఆపై జరిగే బ్రిక్స్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా 400-600 చ.అడుగులలోపు నిర్మిస్తేనే మిగతా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఈ మినహాయింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. న్యాక్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందరిమ్మ ఇళ్ళ పై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్..
