మరోసారి రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. 

lokesh-16.jpg

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే దీనికి కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ గురించి ఈ రోజు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. రెడ్ బుక్ గురించి నేను చేసిన ప్రతి ప్రసంగం గమనించండని నారా లోకేష్ తెలిపారు. ఎవరైతే కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్లని నేను వదిలిపెట్టను అని స్పష్టంగా చెప్పానని మంత్రి లోకేష్ అన్నారు. ఎవరిని వదిలేది లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Share this post

scroll to top