మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్ ముద్దుగుమ్మ రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ లో తలపడగా 19 ఏళ్ల రియా విజేతగా నిలిచింది. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్నిఆమెకు బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రియా సింఘా చాలా సంతోషంగా ఉన్నారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. నేను ఈ కిరీటానికి అర్హురాలిని అని భావిస్తున్నా. గత విజేతలే నాకు స్ఫూర్తి’ అని రియా చెప్పారు.