ఒక్కో ఎమ్మెల్యే మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నారు. రోజు రోజుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాష్ గౌడ్ కు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని భావించిన్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి సమకంలో పార్టీ కండువా కప్పుకోనున్న అరికెపూడి..
