త్వరలో బీఆర్ఎస్ఎల్పీ.. కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని విమర్శించారు. కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదన్నారు. ఒకవేల దొరికినా, గంటల తరబడి వెయిట్ చేయించేవారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు.
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం దానం షాకింగ్ కామెంట్స్..
