కేసీఆర్ నిర్ణయం మేరకు విరాళం..

harish-rao-4.jpg

తెలంగాణాలో వరదలు ఉన్న తరుణంలో BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు BRS పార్టీ ఎమ్మెల్యేలు. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో విరాళం ప్రకటించిన హరీష్ రావు ఈ మేరకు చెక్ అందజేశారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెరో రూ.50లక్షలు, విశ్వక్ సేన్ చెరో రూ.5 లక్షలు అందించగా ప్రభాస్ ఏపీ, తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు రూ.5 కోట్లు అనగా.. చెరో రూ.2.5కోట్లు భారీ విరాళం ప్రకటించారు. కేరళలో వరదల వచ్చిన సమయంలోనూ ప్రభాస్ రూ.2కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Share this post

scroll to top