కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు స్వల్ప గుండెపోటు వచ్చింది. గత రెండు రోజుల కిందట ఎమ్మెల్యే సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో.. ఆయనకు వైద్యులు ఆంజియోగ్రామ్ వేశారు. అనంతరం.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో.. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు.. ఎమ్మెల్యే సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి కవ్వంపల్లి అనురాధ మాట్లాడుతూ.. ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. కాగా.. స్వల్ప గుండెపోటుకు గురైన విషయం తెలియడంతో కార్యకర్తలు, పలువురు ముఖ్య నేతలు ఫోన్ చేసి పరామర్శించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు స్వల్ప గుండెపోటు..
