కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట మర్డర్..

ravanth-28.jpg

సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో నిన్న రాత్రి జరిగిన మహిళ దారుణ హత్య‌ను ఉద్దేశించి బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. సదాశివపేట సమీపంలో మహిళపై అత్యంత కృరంగా ప్రవర్తించి దారుణంగా హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట మర్డర్, దొంగతనం, మహిళలపై అత్యాచారం జరుగుతున్నాయని ఆరోపించారు.

నేడు సంగారెడ్డిలో తమ పిల్లలను స్కూల్‌కు పంపించాలన్నా తల్లిదండ్రులు భయందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోమ్ శాఖ తన చేతుల్లోనే ఉందని, కానీ సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజల బాగోగులు చూసుకోలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Share this post

scroll to top