తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. కవిత గైనిక్, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కవిత గతంలో కూడా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఆమె కళ్లు తిరిగి కింద పడిపోయారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కవితను తిరిగి తీహార్ జైలుకు తీసుకొచ్చారు. మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. మార్చి 15 కవిత అరెస్ట్ అయింది. గత 5 నెలలుగా ఆమె తీహార్ జైలు లో ఉంటున్నారు.
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..
