తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే మరోపక్క ఈ అందాల పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదని చురకలు అంటించారు. ఐపీఎల్ ను ఎలాగైతే వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలను కూడా అలానే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాయిదా వేసుకోకపోతే ప్రపంచానికి వేరే రకమైన సందేశం పోతుందని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి..
