ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠకు తెర పడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తది విచారణ చేపట్టిన జస్టీస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా ఈడీ తరఫున ఎస్వీ రాజు తన వాదిస్తున్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహత్గీ అన్నారు. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లపై ఇప్పటికే విచారణ పూర్తైందని తెలిపారు.
ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయనడం కేవలం ఆరోపణలేనని ధర్మాసనానికి వివరించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని ఈడీ, సీబీఐ కేసులో ఆమె గత ఐదు నెలలుగా జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ కూడా ముగిసాయని కేసులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదన్నారు. ఈడీ నుంచి నోటీసులు రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు ప్రశ్నించగా అందుకు రోహత్గీ సమాధానమిస్తూ ప్రజలు ఎవరైనా ఫోన్లు, కార్లు మార్చండం మారుస్తూ ఉండటం సహజమని అన్నారు.