పవన్ డిప్యూటీ CM కావడం ఏపీ ప్రజల దురదృష్టం..

kavitha-10.jpg

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావాజాలంతో ఉన్నట్లు కనిపించారు. చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కంప్లీట్‌‌గా లెఫ్ట్ నుంచి రైట్‌కు వచ్చారు. బీజేపీ పక్కన చేరిన నాటి నుంచి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది. ఆయన చేసే ప్రకటనలు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండవు.

Share this post

scroll to top