వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..

helicopeter-08.jpg

వైఎస్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసం కావడంతో వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గంలో బెంగళూరు బయల్దేరి వెళ్లిన విషయం విదితమే కాగా జగన్‌ హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ ధ్వంసంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కుట్రపూరితంగానే పోలీస్ భద్రతను తొలగించారా? అని ప్రశ్నిస్తోంది. వైఎస్‌ జగన్‌ భద్రతపై ప్రతిసారీ ఇదే నిర్లక్ష్యం అంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముందుగా సమాచారం ఇచ్చే జగన్‌ రామగిరికి వెళ్లారు. మాజీ సీఎంకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? ఆయన ప్రతి పర్యటనలోనూ పోలీసుల తీరు ఇదే రకంగా ఉంది. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జగన్ భద్రతను పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు గుప్పించారు.

Share this post

scroll to top